బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో నివసించె దుబాయిలోనూ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పాటలతో మరియు నృత్యాలతో ఆడపడుచులందర్ని గాయిని మధుప్రియ ఉత్తేజపర్చగా తన మధుర స్వరంతో గాయకుడు అష్ట గంగాధర్ ఆలపించిన గీతాలు సభికులను ఉర్రూతలూగించారు. జగిత్యాలకు చెందిన ఉట్నూరి రవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా దుబాయి తెలుగు అసోసియెషన్ సభ్యులు పూర్తిగా సహకారమందించారు. యు.ఏ.ఇ చరిత్రలో ప్రప్రధమంగా 9 అడుగుల ఎత్తున బతుకమ్మ పూలను పేర్చడం మరుపు రాని అనుభూతి అని రవి పెర్కోన్నారు.
తెలుగు అసోసియెషన్ ఉపాధ్యక్షుడు మసియోద్దీన్ స్వాగతోపన్యాసంతో మోదలయిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రవాసీయులు కూడ ఉత్సహాంగా పాల్గొన్నారు. తెలుగు అసోసియెషన్ పక్షాన బలుస వివేకానంద, డైరెక్టర్ వెంకట సురేశ్, ఫహీం, నూకల మురళీ కృష్ణ, సుంకు సాయిప్రకాశ్, దామర్ల శ్రీధర్, యెండూరి శ్రీనివాస్, లత, సౌజన్య, విమల, ఉష, విజయ భాస్కర్, భీం శంకర్, శరత్ చంద్ర, చైతన్య, శివ, మోహన్ కృష్ణా బతుకమ్మ నిర్వహణను సమన్వయం చేసారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z