Politics

నేడు గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ

నేడు గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టు అంశంతో పాటు రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించేందుకు.. గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను తెలుగుదేశం నేతల బృందం కలవనుంది. వీరికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. న్యాయస్థానాల్లో 17Aపై వాదనలు జరిగిన క్రమంలో గవర్నర్‌తో తెలుగుదేశం నేతల భేటీ కీలకంగా మారనుంది. చంద్రబాబు కేసులపై గవర్నర్ ఇప్పటికే ఆరా తీసినట్లు సమాచారం. 17A నిబంధనను ప్రభుత్వం గాలికి వదిలేసిందనే అంశాన్ని నేతలు గవర్నర్‌కు వివరించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z