Business

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త లుక్

టాటా సన్స్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానాలు కొత్త రూపులోకి మారిపోయాయి. ఎయిర్‌ ఇండియాను తమ చేతుల్లోకి తీసుకున్న టాటా గ్రూప్ (Tata Group)‌.. ఆ తర్వాత సంస్థలో పలు మార్పులు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటీవలే సంస్థ లోగో (Logo)తోపాటు విమానాల రూపురేఖల్లో కొద్దిగా మార్పులకు శ్రీకారం చుట్టింది.ఇందులో భాగంగానే కొత్త లుక్‌లోకి మారిపోయిన ఎయిర్‌ ఇండియా విమానాలను సంస్థ ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త రూపులోకి మారిపోయిన ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) విమానాలను విడుదల చేసింది. మునుపటి డిజైన్‌కు భిన్నంగా కొత్త చిహ్నాలతో.. ఆరెంజ్‌ (Orange) కలర్‌ రంగులో మెరిసిపోతున్న బోయింగ్‌ – 737 విమానాన్ని సంస్థ బుధవారం ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.కాగా, కొత్త రూపులోకి మారిపోయిన ఎయిర్‌ ఇండియా విమానాలను ఇటీవలే సంస్థ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్‌ (France)లోని టౌలోసీ (Toulouse) వర్క్‌షాప్‌లో కొత్త లోగో, సరికొత్త డిజైన్‌తో తీర్చిదిద్దిన ఏ350 విమానం ఫొటోలను అక్టోబర్‌ 7న తన అధికారిక ట్విట్టర్‌ (ఎక్స్‌) ఖాతాలో పోస్టు చేసింది.కొత్తగా తీర్చిదిద్దిన A350 విమానాలు ఈ శీతాకాలంలో భారత్‌కు వస్తాయని ఎయిర్‌లైన్స్ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z