DailyDose

రాహుల్‌కి కిషన్ రెడ్డి సవాల్‌- తాజా వార్తలు

రాహుల్‌కి కిషన్ రెడ్డి సవాల్‌-  తాజా వార్తలు

*  రాహుల్‌కి కిషన్ రెడ్డి సవాల్‌

కాంగ్రెస్ పార్టీ బీ టీమ్ బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​తో కలిసి పనిచేసింది హస్తం పార్టీయేనని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ..కాంగ్రెస్‌లో బీఆర్ఎస్​ను విలీనం చేస్తానన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నదా? లేదా? కాంగ్రెస్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు. దర్యాప్తు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పినా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఎవరు ఎవర్నీ కాపాడుతున్నారో రాహుల్‌గాంధీ చెప్పాలని కిషన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌, బీఆర్ఎస్​లు మధ్యవర్తిగా మజ్లిస్‌ పార్టీని పెట్టుకున్నాయి. మజ్లిస్‌ పార్టీని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకుండా చేస్తున్నారు. తెలంగాణ రాజకీయ వేదికగా కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం డీఎన్‌ఏలు ఒక్కటే. ఈ మూడు పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నాయి. ఎవరికి ఎవరు బీ టీమ్‌ అనే అంశంపై చర్చకు రావాలని రాహుల్‌ గాంధీకి సవాల్‌ చేస్తున్నాను. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అయినా సరే…దిల్లీ ప్రెస్‌క్లబ్‌ అయినా సరే చర్చకు రావాలి. తేదీ, సమయం, స్థలం మీరు నిర్ణయిస్తే చర్చకు వచ్చేందుకు మేము సిద్ధం. రాహుల్‌ రాజకీయ అవగాహన లేకుండా రాసిచ్చినవి చదువుతున్నారు. అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తలసాని

హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మోండా మార్కెట్ డివిజన్ లోని బండిమెట్, చేపల బావి, నాలా బజార్ ప్రాంతాలలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టతారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత పది ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారని ఆయన అన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ అప్‌డేట్‌

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి తొమ్మిది కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.56 కోట్లు. బుధవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,377గా ఉంది. 

*  కవితపై జీవన్ రెడ్డి ఫైర్ 

ఎనకట ఎలిజబెత్ క్వీన్ ఉండే ఇప్పుడు కొత్తగా లిక్కర్ క్వీన్ వచ్చిందంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పట్టణంలోని 22 వార్డులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఆడపడుచులకు ఉద్బోధ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బతుకమ్మపై బొడ్డెమ్మకు బదులు విస్కీ బాటిల్ పెట్టి బతుకమ్మ ఆడతారని విమర్శించారు. ఎంపీగా కవిత పార్లమెంట్ పరిధిలో చేసింది ఏమీ లేదన్నారు. బోధన్, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీలను మూసేయించిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి గానీ రాహుల్ గాంధీ గురించి గానీ మాట్లాడే అర్హత కవితకు లేదని చురకలంటించారు.

రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో అపశృతి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బైక్‌ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లిలో రాహుల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ బైక్‌ నడుపుతూ కిందపడిపోయారు. స్వల్ప గాయాలతో సురేఖ బయటపడ్డారు. రాహుల్ ర్యాలీలో కార్యకర్తలంతా బైక్ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ప్రజలనుద్దేశించి రాహుల్ ప్రసంగించారు.

*   విజృంభిస్తున్న డెంగ్యూ

దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో డెంగ్యూ, చికున్‌గున్యా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ రాజధాని ప్రాంతంతో పాటు ఉత్తరభారతంలో చాలామంది వైరస్‌లతో బాధపడుతున్నారు. డెంగ్యూతో ఆసుపత్రుల్లో రోగుల సంఖ్యతో పాటు మరణాలు పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్‌ డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు దోమలబారినపడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పగటిపూట ఎక్కువడగా డెంగ్యూ వ్యాధిని కలిగించే దోమలు ఎక్కువగా కుడదాయని, శరీర భాగాలను కప్పి ఉంచేలా దుస్తులను ధరించాలని సూచిస్తున్నారు

ఎన్డీయేతో పొత్తు అంశం జేడీఎస్‌లో ప్రకంపనలు

ఎన్డీయేతో పొత్తు అంశం జేడీఎస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన కర్నాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను ఆ పార్టీ జాతీయ అధినేత దేవెగౌడ గురువారం నుండి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కర్నాటక రాష్ట్ర శాఖకు తాత్కాలిక అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించారు. కాగా, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని జేడీఎస్ నేత సీఎం ఇబ్రహీం విభేదించారు.జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తనకే అధికారం ఉంటుందని వారు (దేవేగౌడ, కుమారస్వామి) బీజేపీతో వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన స్టేట్ ప్రెసిడెంట్ సీఎం ఇబ్రహీంపై బహిష్కరణ వేటు వేశారు దేవెగౌడ. కాగా, ఈ పరిణామం కర్నాటక రాజకీయాల్లో భారీ కుదుపుగా మారింది. మరో వైపు దక్షిణ భారత దేశంలో పట్టు సాధించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు జేడీఎస్‌లో చీలిక తీసుకురావడం కమలనాథుల్లోనూ టెన్షన్‌గా మారింది.

దుర్గమ్మను దర్శించుకున్న సినీనటి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు సినీ నటి మెహరీన్. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శనానికి అందరూ సహకరించారన్నారు.   ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. అలాగే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్టు తెలిపారు.

* నవరాత్రి మేళాలో అకస్మాత్తుగా నిలిచిపోయిన జెయింట్‌ వీల్‌

న్యూఢిల్లీ‌ లోని నరేలా ప్రాంతంలో జరుగుతున్న నవరాత్రి మేళా లో బుధవారం ఓ జెయింట్ వీల్‌  అకస్మాత్తుగా నిలిచిపోయింది. రాత్రి 10:30 గంటల ప్రాంతంలో సాంకేతిక సమస్య కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో 20మందికిపైగా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సహకారంతో వారందరినీ సురక్షితంగా రక్షించారు.ఘటనపై ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. బుధవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తమకు కాల్‌ వచ్చినట్లు చెప్పారు. నరేలా లోని సుభాష్‌ రాంలీలా మైదాన్‌ లో జరుగుతున్న నవరాత్రి మేళాలో సాంకేతిక సమస్యల కారణంగా జెయింట్‌ వీల్‌ మధ్యలో ఆగిపోయిందని చెప్పారు. అందులో నలుగురు పిల్లలు, 12 మంది మహిళలు, నలుగురు పురుషులు మొత్తం 20 మంది చిక్కుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు ఫైర్‌ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకొని జెయింట్‌ వీల్‌లో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా రక్షించినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z