విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు అలెర్ట్..రేపు వీఐపీ దర్శనాలు బంద్ కానున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రేపు విఐపిల అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోగా… రేపు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఆటు కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని…. కేవలం క్యూలైన్ల ద్వారా మాత్రమే భక్తులు దుర్గమ్మను దర్శించుకోవాలని సూచించారు. కాగా, దేశవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రి.. తెలంగాణలోని భద్రకాళీ అమ్మవార్ల సన్నిధిలో ఈ వేడుకలు శోభాయమానంగా సాగుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను అధికారులు.. అంబరాన్నంటేలా నిర్వహిస్తున్నారు.