Politics

తెలంగాణ ప్రజలు పెగు బంధాన్ని ఆదరిస్తారు: కవిత

తెలంగాణ ప్రజలు పెగు బంధాన్ని ఆదరిస్తారు:  కవిత

తెలంగాణతో కాంగ్రెస్‌కు ఉన్నది ఎన్నికల బంధమేనని..బీఆర్‌ఎస్‌(BRS)ది పేగు బంధం అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ పార్టీ కార్యాలయలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు కచ్చితంగా ఆదరిస్తారు. తెలంగాణను వెనుకబడేయడంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు.హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపింది నాటి ప్రధాని నెహ్రూ కాదా అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని సూటిగా ప్రశ్నించారు. 1969 ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై కాల్పులు జరిపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన వారిపై ఇందిరా గాంధీ కాల్పులు జరిపిస్తే 369 మంది అమరులయ్యారన్నారు.

తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. 2009లో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నామని ప్రకటించి వెనక్కి వెళ్లిన కారణంగా వందలాది మంది అమరులయ్యారన్నారు. కాంగ్రెస్‌ తన ద్రోహ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని రాహుల్‌ గాంధీకి హితవు పలికారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z