దసరా నవరాత్రుల్లో అమ్మవారిని భక్తులు పలురకాల పద్ధతుల్లో కొలుస్తారు. గుజరాత్‌లోని నర్మద జిల్లా రాజ్‌పిప్‌లా పట్టణంలో ఉన్న హర్‌సిద్ధీ మాత ఆలయంలో ఖడ్గాలతో అమ్మవారికి హారతి సమర్పిస్తారు. 420 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ హర్‌సిద్ధీ మాత రాజ్‌పుత్‌ల కులదేవతగా ప్రసిద్ధి చెందింది. నవరాత్రి వేళలో ఈ అమ్మవారికి గత తొమ్మిదేళ్లుగా ఖడ్గాలతో హారతి ఇస్తున్నారు. గుడి ముందు భాగంలో పూలతో విల్లు, బాణం ముగ్గు వేస్తారు. దాని మధ్యలో తెల్లటి పైజామా, కాషాయ తలపాగా ధరించిన దాదాపు 175 మంది యువకులు కూర్చొని హర్‌సిద్ధి మాతకు మహా హారతి సమర్పిస్తారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య దాదాపు గంటన్నరపాటు సాగే కార్యక్రమానికి ఈ ఏడాది భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యువకులు కత్తులు తిప్పుతూ హారతి ఇస్తున్నప్పుడు వారిపై పూలవర్షం కురిపించారు.
👉 – Please join our whatsapp channel here –