తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏ క్షణంలో అయినా భాజపా అభ్యర్థుల ప్రకటన రావొచ్చని ఎంపీ లక్ష్మణ్ వెల్లడించారు. 3 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని తెలిపారు. తెలంగాణ నుంచి 50కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్లు వివరించారు. దిల్లీలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.‘‘అభ్యర్థుల ఎంపికలో భాజపా సామాజిక న్యాయం పాటిస్తుంది. సీట్ల కేటాయింపులో మహిళలు, బీసీలకు పెద్దపీట వేశాం. మొదటి విడతలో బీసీలకు 20కి పైగా సీట్లు కేటాయిస్తున్నాం. మహిళా రిజర్వేషన్‌కు సంబంధించి దిల్లీలో ఎమ్మెల్సీ కవిత ధర్నాలు చేశారు.. కానీ, మహిళలకు భారాస సీట్లు కేటాయించలేదు. కాంగ్రెస్, భారాస బీసీలను పట్టించుకోవడం లేదు. రాజాసింగ్ సస్పెన్షన్, పోటీ అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తోంది’’ అని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –