రేపు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు భేటీకానున్నారు. కేసీ వేణుగోపాల్‌తో రేవంత్, ఉత్తమ్, భట్టి, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు భేటీకానున్నారు. ఇందులో భాగంగానే.. రేవంత్, ఉత్తమ్, భట్టి ఢిల్లీ బయల్దేరారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –