పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, చురుకుగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. పిల్లల మెదడు కంప్యూటర్ లా పనిచేయాలని కన్న వాళ్లు ఆశ పడుతుంటారు. కానీ పోషకాల కొరత కారణంగా పిల్లల మెదడు చురుకుగా పని చేయడం లేదు. వీటిని తీసుకుంటే.. పిల్లల మెదడు చురుకుగా పనిచేస్తుంది. అవేంటో ఇక్కడ చూద్దాం..
పిల్లలకు కోడి గ్రుడ్డు జ్ఞాపకశక్తిని పెంచేలా చేస్తుంది. ఎగ్స్ ని చిన్న పిల్లలకు పెడితే వాళ్ల బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బోహైడ్రేట్ల వంటి పోషకాలతో పాటు కోలిన్ ఉంటుంది. ఇది పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.చేపలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు , జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలకు చేపలను ఆహారంగా పెట్టాలి. ఓట్స్ ను ఆహారంగా ఇవ్వడం కూడా మంచిది . ఓట్స్ లో పిల్లల శరీర ఎదుగుదలకు, పిల్లల మెదడు చురుకుగా పనిచేయడానికి కావలసిన అన్ని పోషకాలు ఉంటాయి.
👉 – Please join our whatsapp channel here –