తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు ఖరారైనట్లు కన్పిస్తోంది. మూడు రోజులుగా … రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విడిగా 32 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన నేతలు సిద్ధమయ్యారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు రెండు పార్టీలు కలిసి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్ని స్థానాల్లో పోటీ అనేది.. రేపు అధికారికంగా ప్రకటించనున్నాయి. ఈనెల 23న తెలంగాణ జనసేన నేతలు రాజమండ్రికి వెళ్లి పవన్‌తో చర్చించనున్నారు.
👉 – Please join our whatsapp channel here –