తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇప్పటికే తొలి జాబితాను రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల నేరచరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అక్టోబర్ 21న నివేదిక వెల్లడించింది.తెలంగాణలోని 118 ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు, 46 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. 119 నియోజకవర్గాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ఖాళీగా ఉంది. ఎమ్మెల్యే సాయన్న మృతితో ఖాళీగాఉంది. అందుకే 118 మందిపై సర్వే చేసినట్లు ఏడీఆర్ వెల్లడించింది.2018 ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లు.. ఆ తర్వాత నిర్వహించిన ఎన్నికల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఏడుగురు ఎమ్మెల్యేలపై ఐసీపీ సెక్షన్ 307 కంద హత్యాయత్నాకి సంబంధించిన కేసులు, నలుగురు ఎమ్మెల్యేలపై మహిళలపై నేరాలకు సంధించిన కేసులు ఉన్నాయని తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –