సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు అత్యంత కన్నుల పండుగగా జరిగాయి. సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుండి పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బతుకమ్మలను అందంగా అలరించి జానాపద భక్తి పాటలతో ఆడిపాడారు. సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆకట్టుకుంది. మూడు ఉత్తమ బతుకమ్మలకు బహుమతి ప్రదానం చేశారు. అధ్యక్షులు బొమ్మారెడ్డి వేడుకల విజయవంతానికి తోడ్పడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కురిచేటి స్వాతి, కార్యదర్శి అనిల్ కుమార్లు ఏర్పాట్లు పర్యవేక్షించారు.