Business

దసరా సందర్భంగా విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

దసరా సందర్భంగా విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు

దసరా పండగ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నంబరు 06285/06286 బెంగళూరు-సంత్రాగచి ప్రత్యేక రైలు ఈ నెల 21న బెంగళూరులో తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.10 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 23న సంత్రాగచిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10గంటలకు బెంగళూరు చేరుతుంది. కృష్ణరాజపురం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

06073/06074 చెన్నై-భువనేశ్వర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 23, 24, 30, 31, నవంబరు 6, 7 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు భువనశ్వర్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్‌ స్టేషన్లలో ఆగుతుంది.

06071/06072 చెన్నై-సంత్రాగచి ప్రత్యేక రైలు ఈ నెల 21, 23, 28, 30 నవంబరు 4, 6 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము 3.45కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఆగుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z