Movies

టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో చేసిన మార్పులేంటి?

టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో చేసిన మార్పులేంటి?

‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా రన్‌టైమ్‌లో మార్పులు చేసింది. సుమారు అరగంట నిడివిని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2.37 గంటల రన్‌టైమ్‌తో ఇకపై ఇది ప్రేక్షకులను అలరించనుంది. సినీ ప్రియుల నుంచి వస్తోన్న రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకునే చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రవితేజ ప్రధాన పాత్రలో నటించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 3.02 గంటల నిడివితో ఈ సినిమా సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా పాజిటివ్‌ టాక్‌ అందుకుంది. కథా, కథనం, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ నిడివి ఎక్కువగా ఉందని సినీ ప్రియులు, విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించిన చిత్రబృందం రన్‌టైమ్‌ను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z