కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా అమిత్ షాకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుత తరంలో అత్యంత డైనమిక్ హోంమంత్రి అమిత్ షా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. వ్యవస్థను సజావుగా నడిపించడం కోసం మీకు అధకారం, ఆరోగ్యం ఉండేలా ఆ దేవుడు దీవించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. హరీశ్ శంకర్ ట్వీట్ కు అమిత్ షా బదులిచ్చారు. హరీశ్ శంకర్ గారికి ధన్యవాదాలు అంటూ స్పందించారు. మీరు మన సినిమాలకు మరింత పేరు తెస్తారని ఆశిస్తున్నాను అంటూ తెలిపారు.అటు, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అమిత్ షాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “అమిత్ షా జీ… మీకు వెరీ హ్యాపీ బర్త్ డే. దేశం కోసం మీ అంకితభావం అసాధారణం” అని పేర్కొన్నారు. అందుకు అమిత్ షా స్పందిస్తూ… రామ్ చరణ్ మీరు హృదయపూర్వకంగా తెలిపిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు అంటూ పేర్కొన్నారు.
👉 – Please join our whatsapp channel here –