కెనడాలోని (Canada) హాలిఫ్యాక్స్‌లో (Halifax) బతుకమ్మ (Bathukamma) పండుగను ఘనంగా నిర్వహించారు. మ్యారిటైం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్దసంఖ్యలో ఆడపడుచులు పాల్గొన్నారు. తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి జానపద పాటలతో సంబురంగా జరుపుకున్నారు. వేడుకల్లో 8 అడుగుల ఎత్తయిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. తెలుగు ప్రజలు బతుకమ్మ వేడుకల్లో పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తంచేశారు.
👉 – Please join our whatsapp channel here –