హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను మరింత సమర్థంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్ధమైంది. వీసా అర్హతల నిబంధనలు, ప్రయోజనాల పెంపు, పలు సడలింపులతో కూడిన సమగ్ర మార్పులు చేయబోతున్నది. హెచ్1బీ వీసా వ్యవస్థ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు బైడెన్ ప్రభుత్వం సింగ్యులర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారుడి తరపున ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న దాంతో సంబంధం లేకుండా అతడి వివరాలను ఒకేసారి నమోదు చేసుకుంటారు.దీంతో, ఎక్కువ దరఖాస్తుల ద్వారా వీసా లాటరీని తప్పుదోవ పట్టించే అవకాశం ఉండదనేది కొత్త ప్రతిపాదన. అలాగే లబ్ధిదా రుడి తరఫున ఎక్కువ అప్లికేషన్లు పెట్టే చాన్స్ లేకుండా సంస్థలను యూఎస్ కట్టడి చేయనుంది. రూల్స్పాటించని వారి అప్లికేషన్లు రిజెక్ట్చేయడం, ఫైన్లు వేయ డం లేదా వారిపై రివోక్ చేయడం వంటివాటికి చాన్స్ కల్పించే కఠిన రూల్స్ ప్రతిపాదిస్తున్నారు. అభ్యర్థుల విద్యార్హత, వారు చేయబోయే ఉద్యోగానికి మధ్య సంబంధంపై స్పష్టత చేకూర్చేలా నిబంధనలు రూపొందిస్తున్నది. గ్లోబల్ టాలెంట్‌ను ఆకర్షించడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మోసం, దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –