ప్రపంచకప్‌లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో రోహిత్ సేన కివీస్‌ను ఢీకొనబోతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లూ ఎనిమిది సార్లు తలపడ్డాయి. అయిదు మ్యాచ్‌ల్లో కివీస్ నెగ్గగా.. టీమ్‌ఇండియా మూడింట్లో గెలిచింది. చివరగా 2019లో సెమీస్‌లో భారత్‌పై కివీసే పైచేయి సాధించింది.
ఇరు జట్లు: భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కీపర్/కెప్టెన్),గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
👉 – Please join our whatsapp channel here –