కాలిఫోర్నియా బే ఏరియా లోని ” సాన్ రామోన్” నగరంలో WETA ఘనంగా ” బతుకమ్మ” సంబరాలు!!
కాలిఫోర్నియాలోని బే ఏరియాలో లోని ” సాన్ రామోన్” నగరంలో ” బతుకమ్మ” సంబరాలు ఘనంగా నిర్వహిచారు! WETA ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. పూలను అమ్మవారిగా భావించి పూజించే గొప్ప సంప్రదాయం మనకిక్కడ కనిపిస్తుంది. ఈ పండుగ రోజుల్లో దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న అందంగా వేడుక సాగింది.
మా టీవీ “రేలా-రే-రేలా” 5 దరువు టైటిల్ విన్నర్ “శాలిని” మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు.
ఏటా 1000 మందితో “బతుకమ్మ” పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన “WETA ” ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేసినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి గారు ప్రత్యేక ధన్యవాధాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –