దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరమవుతున్నది. సోమవారం ఢిల్లీలో గాలి నాణ్యత చాలా పేలవమైన కేటగిరికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీలో ఎన్‌సీఆర్‌లో గాలి నాణ్యత పడిపోయింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 322గా నమోదైందని సఫర్ తెలిపింది. పొగమంచు కారణంగా దృశ్యమానత తగ్గింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్, హసన్‌పూర్ డిపో, తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి పొగ మంచు భారీగా పేరుకుపోయింది. ఫలితంగా రోడ్లపై ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించడం లేదు.అలాగే నెహ్రూ పార్క్, తీన్‌మూర్తి మార్గ్ చుట్ట పక్కల ప్రాంతాల్లోను పొగమంచు కమ్మేసింది. ఇండియా గేట్, డ్యూటీ పత్‌లోనూ పొగమంచు పేరుకుపోయింది. మరో వైపు ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం మధ్య పర్యావరశాఖ మంత్రి గోపాల్‌రాయ్ అధికారులతో తెలిపారు. దేశ రాజధానిలో చలి పెరుగుతోందని, గాలి వేగం తగ్గిందని పేర్కొన్నారు. ఢిల్లీలో రెండోగ్రాఫ్ అమలు చేసేందుకు అన్నిశాఖల అధికారులతో సోమవారం మంత్రి సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అయితే, ఇప్పటికే పొరుగు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి.. వరి కొయ్యలు, పొట్టు, వ్యర్థాలను తగులబెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ఇండియా గేట్ పలువురు మాట్లాడుతూ 10-12 నుంచి నుంచి ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందన్నారు. పొగదట్టంగా ఉందని.. పరిస్థితి ఏమాత్రం బాగోలేదన్నారు. సైక్లిస్టులంతా మాస్క్‌లతోనే తిరుగుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే సైకిల్ తొక్కడం మానేసి ప్రత్యామ్నాయంగా వ్యాయామాలు చేస్తామని సైక్లిస్ట్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –