Business

అంతర్జాతీయ సేవలకు సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్

అంతర్జాతీయ సేవలకు సిద్ధమవుతున్న ఆకాశ ఎయిర్

దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్‌ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్‌దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు.రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు.

ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్‌ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది.ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్‌ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌కు 20 విమానాలు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z