ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం వేకువజామున 3 గంటల నుంచి దుర్గమ్మ మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చారు. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అమ్మవారి దర్శనాలు నిలిపివేయనున్నారు. ఒకేరోజు రెండు రూపాల్లో అమ్మవారి దర్శనం నేపథ్యంలో అలంకరణ మార్పు కారణంగా కొద్దిసేపు దర్శనాలు నిలిపివేస్తారు.సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాలు ముగుస్తుండడంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు.
👉 – Please join our whatsapp channel here –