* తిరుమలలో నకిలీ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తరలి వస్తుంటారు. లైన్లలో గంటల తరబడి వేచి ఉంచి స్వామివారిని దర్శించుకుని తమ దారిన తాము వెళ్తుంటారు. అయితే ఓ వ్యక్తి సులువుగా దర్శనం చేసుకోవడానికి తనను తాను ఐఆర్‌ఎస్ అధికారిగా చెప్పుకొచ్చాడు. అందుకు తగినట్లుగా నకిలీ గుర్తింపు పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నాడు. అనంతరం వీఐపీ దర్శనం కోసం వీఐపీ బ్యాడ్జీలు తీసుకున్నాడు. అయితే నికిలీ అధికారి తీరుపై అనుమానం వచ్చిన అధికారులు సోదా చేయగా అసలు బండారం బయటపడింది. అనంతరం సదరు నకిలీ అధికారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనుక వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడిని విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీకి చెందిన వేదాంతం శ్రీనివాస్ భరత్ భూషణ్ (52)గా గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీనివాస్ తనను ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారిగా చెప్పుకునేందుకు భారీగానే స్కెచ్ వేశాడు. పథకం అమలు చేయడానికి నకిలీ గుర్తింపు కార్డులు, విజిటింగ్ కార్డులు, ఆధార్ కార్డు కూడా సృష్టించాడు. అయితే పలుమార్లు టీటీడీకి వచ్చిన సదరు నకిలీ అధికారి కొన్నిసార్లు ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమీషనర్‌గా టీటీడీ అధికారులకు పరిచయం చేసుకునేవాడు. మరి కొన్నిసార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అదనపు కమీషనర్‌గా చెప్పుకునేవాడు. దీంతో సదరు వ్యక్తిపై అనుమానం వచ్చిన టీటీడీ అధికారులు ముందుగా విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు.అనంతరం అతని వద్ద ఉన్న గుర్తింపు పత్రాలను పరిశీలించగా అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. దీంతో శ్రీనివాస్ తమను మోసం చేస్తున్నాడని నిర్ధారించిన అధికారులు అరెస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు నిందితుగు శ్రీనివాస్‌పై చీటింగ్, ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ఆదివారం (అక్టోబర్ 22)న జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తిరుమల పోలీసులు తెలిపారు.
* శంషాబాద్‌లో బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి వచ్చి ప్రయాణికులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రాగా.. లగేజీ బ్యాగును స్కాన్ చేశారు.అందులో బంగారం ఉన్నట్లు తేలింది. అతని వద్ద నుంచి 610 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.32.8లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే మరో ప్రయాణికుడి నుంచి 483 గ్రాముల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వివరించారు.
* ఇజ్రాయెల్ రాకెట్ లాంచ్ మిస్ ఫైర్
ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా లో హమాస్ ఉగ్ర మిలిటెంట్ లకు మధ్యన జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ సైనికులు దాడుల వర్షం కురిపిస్తున్నారు. ఇజ్రాయెల్ కు చెందిన సైనికులు గజ నగరంపై ఎటువంటి విరామం లేకుండా దాడులను చేస్తూనే ఉన్నారు. కాగా ఈ దాడులలో భాగంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన ఒక రాకెట్ లాంచర్ పొరపాటున ఎయిమ్ మిస్ అయ్యి ఈజిప్టు దేశం సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ పోస్ట్ పై పడింది, దీనితో మిలిటరీ పోస్ట్ పూర్తిగా ద్వంసం అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రదేశం ఇజ్రాయెల్, గాజా మరియు ఈజిప్టు మూడు దేశాలకు సరిహద్దు బోర్డర్ గా ఉంది. ఈ ప్రమాదంపై ఇజ్రాయెల్ డిఫెన్సె ఫోర్స్ వెంటనే స్పందించింది. పొరపాటున జరిగిన ఈ తప్పదని మేము చింతిస్తున్నాము.. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపడుతాము అంటూ ఈజిప్టు దేశానికి తెలియచేసింది.మరి దీనిపై ఈజిప్టు ఇంకా స్పందించకపోవడం గమనార్హం. ఈ మిస్ ఫైర్ వలన ఇజ్రాయెల్ కు ఇంకేమి కొత్త చిక్కులు వస్తాయో చూడాలి.
* పండగపూట ఘోర ప్రమాదం
పండుగపూట మన్యం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* ఎనిమిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
మహారాష్ట్రలోని ముంబయి నగరం బొరివలి ప్రాంతంలోని ఎనిమిది అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహావీర్ నగర్ ప్రాంతంలోని ఓ భవనంలో మొదటి అంతస్తులోని ఫ్లాట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మంటలు చెలరేగి విద్యుత్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్‌లకు వ్యాపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురికి గాయాలైనట్టు పురపాలక శాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లను తరలించి మంటలను అదుపు చేస్తున్నారని తెలిపారు. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో క్షతగాత్రులను బొరివలిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
* అనంతపురంలో టీడీపీ నేత రౌడీయిజం
టీడీపీ నేత, చంద్ర దండు అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రౌడీయిజానికి దిగారు. ఆర్‌అండ్‌బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్‌రెడ్డిని ఫోన్‌లో బెదిరించిన ప్రకాష్.. టీడీపీ అధికారంలోకి వస్తే అంతు చూస్తామంటూ రెచ్చిపోయారు.ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో జరిగిన ఇంజనీర్ల మీటింగ్ లో దౌర్జన్యానికి దిగిన ప్రకాశ్ నాయుడు కాళ్లతో డోర్‌ను తన్ని ఇంజనీర్లపై దాడికి యత్నించాడు. దౌర్జన్యం చేసి రివర్స్ కేసు పెట్టేందుకు టీడీపీ నేత ప్రకాశ్ నాయుడు యత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
* మరోసారి తెరపైకి వచ్చిన హిజాబ్
కర్ణాటకలో మరోసారి హిజాబ్ చర్చ మొదలైంది. పోటీ పరీక్షల సమయంలో విద్యార్థులు హిజాబ్ ధరించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆ తర్వాత హిందూ అనుకూల సంస్థలు నిరసన తెలుపుతామని హెచ్చరించాయి. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. నీట్‌లో కూడా దీనికి అనుమతి ఉంది.ప్రజలు తమకు నచ్చిన దుస్తులు ధరించేందుకు స్వేచ్చ ఉందనీ, హిజాబ్ లేదా బురఖాపై ఎలాంటి నిషేధం విధించినా ప్రజల వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లుతుందని కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ అన్నారు. అయితే.. పరీక్షకు గంట ముందు పిలుస్తారని తెలిపారు. వాటిని క్షుణ్ణంగా విచారించనున్నారు. తాము ఎలాంటి దుష్ప్రవర్తనను కోరుకోమని తెలిపారు. గతంలో కూడా హిజాబ్ విషయంలో వివాదాలు వచ్చాయి. కర్నాటకలోని ఉడిపి జిల్లాలోని ఓ జూనియర్ కాలేజీ విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలకు రాకూడదని నిషేధం విధించడం గమనార్హం. ప్రభుత్వ పుయీ కళాశాల 01 జూలై 2021న కళాశాల యూనిఫామ్‌ను అమలు చేసింది. విద్యార్థులందరూ దీనిని అనుసరించాలని కోరారు. కోవిడ్ -19 లాక్‌డౌన్ తర్వాత పాఠశాలలు తిరిగి తెరిచినప్పుడు, కొంతమంది సీనియర్ పాఠశాల బాలికలు హిజాబ్ ధరించడం ప్రారంభించారు. ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి చెందిన విద్యార్థినులు హిజాబ్ ధరించి పాఠశాలకు రావడానికి కాలేజీ అధికారులను అనుమతి కోరారు.డిసెంబర్ 2021, కొంతమంది బాలిక విద్యార్థులు హిజాబ్ ధరించి పాఠశాలకు చేరుకున్నప్పుడు, వారిని గేట్ వెలుపల ఆపారు. దీనిపై, బాలిక విద్యార్థులు కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా 2022 జనవరిలో కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉడిపి జిల్లా తర్వాత, ఇతర జిల్లాలైన శివమొగ్గ, బెలగావిలోని కళాశాలల్లో, బాలికలు హిజాబ్ ధరించి కళాశాలకు రాకుండా నిషేధించారు. మరోవైపు.. హిజాబ్ ధరించిన బాలికలకు వ్యతిరేకంగా ఒక వర్గానికి చెందిన విద్యార్థులు నినాదాలు చేయడం ప్రారంభించారు. కొద్దిసేపటికే విషయం తీవ్రస్థాయికి చేరుకుంది, రెండు వర్గాల విద్యార్థులు ముఖాముఖికి వచ్చారు. ఒకరిపై ఒకరు నిరసనలు ప్రారంభించారు.
👉 – Please join our whatsapp channel here –