తానా కోశాధికారి కొల్లా అశోక్‌బాబు భారత్ పర్యటనలో భాగంగా గుంటూరులోని తలసీమియా నీడ్స్ బ్లడ్ సెంటరును సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఈ కేంద్రంలో తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా రక్తమార్పిడి చేస్తారు. గత ఏడాది కొల్లా లక్ష్మీ-శ్రీనివాస్ దంపతులు 5కె వాక్ ద్వారా సేకరించిన ₹18లక్షలను ఈ సంస్థకు విరాళంగా అందజేశారని అశోక్ గుర్తుచేశారు. స్థానిక విద్యాసంస్థలతో చర్చించి మరింత మంది రక్తదాతలు ఈ కేంద్రానికి సహకారం అందించేలా ప్రణాళిక రూపొందిస్తానని అశోక్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గుంటూరు BNI విభాగ సభ్యులు, వైద్యులు, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.