తెలంగాణాలో రానున్న 37 రోజుల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించడం కోసం అన్ని పార్టీలు వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం మాజీ కాంగ్రెస్ నేత మరియు ప్రస్తుతం బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యు టర్న్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపైన తెలంగాణాలో చర్చ జరుగుతోంది, రేపు ఢిల్లీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షములో పార్టీలో చేరుతారని తెలుస్తోంది. కోమటిరెడ్డికి మునుగోడు లేదా ఎల్బీ నగర్ లలో ఒకచోట నుండి పోటీ చేసే అవకాశాన్ని కల్పించనున్నట్లు ప్రచారంలో ఉంది. నిన్న బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో కోమటిరెడ్డి పేరు లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.ఇక ఎందుకు ఇలా నిలకడ లేని రాజకీయాలు చేయడం అంటూ రాజకీయ విశ్లేషకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –