NRI-NRT

ఫీనిక్స్‌లో ఆటా పికిల్‌బాల్ పోటీలు

ఫీనిక్స్‌లో ఆటా పికిల్‌బాల్ పోటీలు

అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో 14,15 తేదీల్లో అరిజోనాలోని ఫీనిక్స్‌లో పికిల్‌బాల్ పోటీలు నిర్వహించారు. 200మంది పాల్గొన్నారు. సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్ మరియు మిక్స్‌డ్ డబుల్స్‌ వంటి విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు.

విజేతలకు నగదు బహుమతులు అందించారు. ఆటా ఫీనిక్స్ రీజినల్ డైరెక్టర్ రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్లు వంశీకృష్ణ ఇరువారం, శేషిరెడ్డి గాదె, చెన్న మద్దూరి, సలహాదారు సునీల్ అన్నప్పురెడ్డి, ఆటా ఫీనిక్స్ జట్టు, దినేష్ రెడ్డి సూదుల, ఆశిష్ అంకం, శశిధర్ రెడ్డి బిల్లా మరియు సన్నీ రావు తదితరులు పోటీల నిర్వహణకు తోడ్పడ్డారు.

Phoenix ATA Conducts 2023 Pickle Ball Tournament
Phoenix ATA Conducts 2023 Pickle Ball Tournament