తెలుగుదేశం, జనసేన సమన్వయ కమిటీ తొలి సమావేశం నేడు రాజమహేంద్రవరంలో జరగనుంది. ఈ సమావేశానికి తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా రెండు పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మంజీర హోటల్‌లో నేతలు భేటీ అవుతారు. సమావేశం నేపథ్యంలో ఆదివారం రాత్రికి లోకేశ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. నేడు మధ్యాహ్నం ఒంటి గంటలకు పవన్ రానున్నారు.
నేడు చంద్రబాబుతో కుటుంబసభ్యుల ములాఖత్….మరోవైపు తెదేపా అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబసభ్యులు నేడు ములాఖత్ కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును వారు కలవనున్నారు.
👉 – Please join our whatsapp channel here –