* ఒకే కాన్సులో నలుగురికి జన్మ
ఓ గర్భిణి ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. కానీ ఆ నలుగురు పసిపాపలు గంటల వ్యవధిలోనే చనిపోయారు. ఈ విషాద ఘటన జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. కుప్వారా జిల్లాలోని కేరాన్ గ్రామానికి చెందిన కలీదా బేగం గర్భిణి. ఆమెకు నొప్పులు రావడంతో ఆదివారం సాయంత్రం స్థానికంగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు.. కాన్పు ఇక్కడ చేయడం సాధ్యం కాదని, కుప్వారా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాలని కలీదా కుటుంబ సభ్యులకు సూచించారు. ఇక సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుప్వారా జిల్లా ఆస్పత్రిలో కలీదా నార్మల్ డెలివరీ ద్వారా నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. నలుగురిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, ఒకరు అబ్బాయి. శిశువులందరూ తక్కువ బరువుతో జన్మించారు.అయితే ముగ్గురు అమ్మాయిలు కుప్వారా ఆస్పత్రిలోనే మరణించారు. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం తల్లీ, అబ్బాయిని శ్రీనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాబు కూడా చనిపోయాడు. ఇలా గంటల వ్యవధిలోనే నలుగురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కలీదాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కలీదా ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
* రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
రేపు మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. టీకాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్ధుల రెండవ జాబితా పై చర్చించనున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో పలువురు ఇతర పార్టీ నేతల చేరికలు ఉండనున్నాయి.
* పాలస్తీనాకు మద్దతుగా కోయంబత్తూరులో నిరసన
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరులో పలువురు పాలస్తీనాకు సంఘీభావం తెలిపారు. వివిధ సంఘాలకు చెందిన ముస్లిం మహిళలు, పెద్దలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. ఇటీవల హైదరాబాద్, జమ్ముకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు.
* కాంగ్రెస్ మాటలు నమ్మవద్దన్న హరీష్‌రావు
తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరుగుతోందని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్టం కేసీఆర్ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, గ్రూపు గొడవలన్నారు.ధరణి వద్దు అని అంటే పటేల్ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనని హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు హరీష్‌రావు.
* నేపాల్‌ను మళ్లీ వణికించిన భూకంపం
పొరుగు దేశమైన నేపాల్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మరోసారి అక్కడ భూకంపం సంభవించింది. ఈ తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. నేపాల్ రాజధాని ఖాట్మండు (Kathmandu)కు సమీపంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. మరోవైపు వరుస భూకంపాలతో నేపాల్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా, ఈ నెల తొలి వారంలో కూడా నేపాల్‌ను వరుస భూకంపాలు గడగడలాడించాయి. కేవలం అరగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించింది. ఆ తర్వాత కూడా పలుసార్లు స్వల్ప స్థాయిలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం కూడా అక్కడ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.1గా నమోదైంది. రాజధాని ఖాట్మండుకు పశ్చిమాన 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధాడింగ్‌లో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు.
* కేసీఆర్ తెలంగాణ పాలపిట్ట: హరీశ్ రావు
సీఎం కేసీఆర్ తెలంగాణ పాలపిట్ట అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒకవైపు.. తెలంగాణ ద్రోహులందరూ మరో వైపు ఉన్నారన్నారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ..ఉద్యమకారులపై తుపాకీ పెట్టిన వాళ్లు పదవుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చేతుల్లో ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. ఎవరు ఎన్ని మాట్లాడినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమని హరీశ్ స్పష్టం చేశారు.
* రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన
తూర్పుగోదావరి జిల్లా జిల్లా రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకు కీలక ప్రకటన చేసింది. ఇవాళ విజయదశమి పండుగ సందర్భంగా రాజమండ్రీ సెంట్రల్ జైల్లో మూలాకత్ కు సెలవు ప్రకటించింది. ఈరోజు సెలవుకు సంబంధించి నోటీసులను జైలు అధికారులు జారీ చేశారు. ఈ విషయాన్ని గ్రహించి ఖైదీలు రెమాండ్ ఖైదీలు కుటుంబ సభ్యులు సహకరించాలని జైల్లో అధికారులను కోరారు. అయితే మరోవైపు స్కిల్ స్కాం కేసులో టిడిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవాల్టికి 46వ రోజుకు చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు గత నెల 9న అరెస్టు అయ్యారు. నవంబర్ ఒకటో తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు గడువును పొడగించింది.చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు హెల్త్ బులిటను విడుదల చేశారు. తీసుకుంటుండగా నిమిషానికి 62 సార్లు గుండె కొట్టుకుంటున్నట్లు హెల్త్ బులిటన్లో పేర్కొన్నారు. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్య లేదని చంద్రబాబు చాలా ఆక్టివ్ గానే ఉన్నారని డాక్టర్ల టీం జైలు అధికారులకు వెల్లడించింది.
👉 – Please join our whatsapp channel here –