* చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్‌మీ’లు కీలక నిర్ణయం
చైనా టెక్ దిగ్గజాలు వన్‌ప్లస్, రియల్‌మీ’లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లో భారత్ టెలివిజన్ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంటే దేశీయంగా ఆ రెండు కంపెనీలు టీవీలను తయారు చేయడం, వాటిని అమ్మడంలాంటివి చేయవు ఈ రెండు సంస్థలు తమ దేశమైన చైనాలో ఇతర కంపెనీలకు చెక్ పెట్టేలా కార్యకలాపాలపై దృష్టిపెట్టాయి. కాబట్టే భారత్‌లో టీవీ తయారీ, అమ్మకాల్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి. స్మార్ట్ టీవీ విభాగంలో ఈ రెండు కంపెనీలు మరింత ముందుకు సాగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నా.. ఇప్పటికే వన్‌ప్లస్, రియల్‌మీలు అభివృద్ది పరంగా ఇతర కంపెనీల కంటే ముందంజలో ఉండటం గమనార్హం.నివేదిక ప్రకారం .. భారత్‌లో ఇంటర్నెట్ విస్తరణ, సరసమైన డేటా ధరల కారణంగా టెలివిజన్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్ వంటి స్ట్రీమింగ్ సేవలకు విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. అదే సమయంలో టీవీల అమ్మకాలు భారీ ఎత్తున పెరిగాయి. దీన్ని మరింత క్యాష్ చేసుకునేందుకు వన్‌ప్లస్, రియల్‌మీలు టెలివిజన్ సేల్స్, బ్రాండింగ్ విషయంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. కానీ, అనూహ్యం భారత టీవీ మార్కెట్ నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. భారతీయ టెలివిజన్ మార్కెట్‌లో ఎల్‌జీ, శాంసంగ్, సోనీ, ప్యానసోనిక్ వంటి బ్రాండ్‌లతో పాటు చైనా నుండి కొత్తగా అడుగు పెట్టిన షావోమీ, టీసీఎల్ బ్రాండ్‌లు పోటీపడుతున్నాయి. అదనంగా, దేశీయ బ్రాండ్లు వీయూ, థామ్సన్ (బ్రాండ్ లైసెన్సింగ్ కింద) మార్కెట్‌లో చెప్పుకోదగ్గ పురోగతిని సాధిస్తున్నాయి. ఈ క్రమంలో వన్‌ప్లస్, రియల్‌మీ కంపెనీల టీవీ అమ్మకాలు భారీగా పెరుగుతున్నప్పటికీ.. భారత్‌లో చైనా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అమ్మకాలు నిలిపివేయడం గమనార్హం. చివరిగా, రియల్ మీ, వన్ ప్లస్‌లు టీవీ మార్కెట్ నుంచి తప్పుకుంటున్నాయన్న నివేదికలపై ఆ రెండు సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
* రిలయన్స్ చేతికే డిస్నీ?
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌ను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ సంస్థ చర్చలు జరుపుతోంది. అమెరికాకు చెందిన డిస్నీ సంస్థ తమకు చెందిన ఇండియా విభాగాన్ని విక్రయించేందుకు గత కొంతకాలంగా ఆసక్తి చూపుతోంది. ఇందుకోసం పెట్టుబడిదారుల కోసం వెతుకులాట మొదలుపెట్టింది. ముఖేష్ అంబానీతో పాటు అదానీ గ్రూప్, సన్‌టీవీతో సంప్రదింపులు జరిపింది. చివరికి డిస్నీని కొనుగోలు చేసేందుకు ముకేష్ అంబానీ ముందుకొచ్చారు.డిస్నీలోని మెజార్టీ వాటను రిలయన్స్ కొనుగోలు చేయనుంది. 10 బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు డిస్నీ రెడీ అవ్వగా.. 7 లేదా 8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఆసక్తి చూపుతోంది. త్వరలో డీల్‌పై అధికార ప్రకటన రానుండగా.. కొంత మొత్తంలో నగదు చెల్లించనుండగా.. మరికొంత షేర్ల రూపంలో బదిలీ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు.రిలయన్స్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత.. డిస్నీ ఇండియాకు మైనారిటీ వాటా మాత్రమే ఉంటుంది. ఇండియాలో ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్‌ల లైవ్ ద్వారా డిస్నీ ఎక్కువమంది సబ్‌స్కైబర్లను పెంచుకుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. దీంతో భారత్‌లో డిస్నీకి యూజర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఈ క్రమంలో ఇండియా విభాగాన్ని విక్రయించేందుకు డిస్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది.
* ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం
ఆదాయపుపన్ను కట్టనివారిపై సంబంధిత శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని పన్ను ఎగవేతదారుల ఆట కట్టిస్తోంది. ‘360డిగ్రీ ప్రొఫైలింగ్’ ద్వారా అపరకుబేరులు కట్టే పన్ను ఎగవేతను అరికట్టేలా చర్యలు తీసుకుంటుంది. గడిచిన బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయంపై అత్యధిక పన్ను రేటును 42.74 నుంచి 39 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల(హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్) పన్ను ఎగవేతను అరికట్టలేకపోవడంపై ఆదాయపు పన్ను శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా తక్కువ మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తూ ఎగవేతకు పాల్పడుతున్న కోటీశ్వరులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.రూ.1కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగి ఉన్న లేదా అందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ‘360-డిగ్రీల ప్రొఫైలింగ్’ చేయనున్నట్లు ఐటీ విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆయా వ్యక్తుల పెట్టుబడి ప్రొఫైల్, ఖర్చులు, అసెస్‌మెంట్ కోసం ఆదాయ వనరులను ట్రాక్ చేస్తోందని వెల్లడించారు.గడిచిన ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల 61 వేల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌ల్లో రూ.ఒక కోటి కంటే ఎక్కువ ట్యాక్సబుల్ ఆదాయాన్ని చూపించారు. అయితే ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఐటీ స్క్రీనింగ్ పూర్తయిన తర్వాత తమ ఆదాయాన్ని తక్కువగా నివేదించిన వారికి నోటీసులు పంపనున్నట్లు సమాచారం.
* భారత్‌లో ACల విద్యుత్ వినియోగం
భారత్‌లో క్రమంగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇళ్లలో ఉపయోగిస్తున్న AC లకు అవసరమయ్యే విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది 2050 నాటికి తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) మంగళవారం తెలిపింది. అలాగే, ప్రస్తుతం ఆఫ్రికా ఖండం మొత్తంలో ఉపయోగిస్తున్న విద్యుత్ కంటే ఎక్కువగా ఉంటుందని IEA నివేదిక పేర్కొంది. రాబోయే మూడు దశాబ్దాల్లో ప్రపంచంలోని ఇతర దేశాల్లో లేనంతగా విద్యుత్ డిమాండ్ భారత్‌లో మాత్రమే ఉంటుంది. 2022 లో విద్యుత్ డిమాండ్ 42 ఎక్సాజౌల్స్ (EJ) నుంచి 2030 నాటికి 53.7 EJ అలాగే, 2050 నాటికి 73 EJకి పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.భారత్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సాధారణంగా ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సియస్ దాటుతున్నందున AC లు, కూలర్లు, ఇతక కూలింగ్ పరికరాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. ప్రతి 50 ఇళ్లలో దాదాపు 10 ఇళ్లకు AC లు ఉన్నాయి. మిగతా వాటిలో సాధారణ కూలర్లు, ఇతర పరికరాలు ఉంటున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు AC ల వాడకం పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. CO2 ఉద్గారాలను తగ్గించి, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడటం ద్వారా విద్యుత్ వినియోగాన్ని అదుపులో ఉంచవచ్చని IEA తెలిపింది.విద్యుత్‌తో పాటు చమురు వినియోగం కూడా రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. ఇది 2022లో రోజుకు 5.2 మిలియన్ బ్యారెల్స్ నుంచి 2030లో 6.8 మిలియన్ బ్యారెల్స్‌కు, 2050 నాటికి 7.8 మిలియన్ బ్యారెల్స్‌కు చేరుతుందని నివేదిక పేర్కొంది.
* బంగారం వెండి ధరలు తగ్గుముఖం
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 2023 అక్టోబర్ 24 మంగళవారం నాటికి 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 56 వేల 350 గా ఉంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ, 300 తగ్గి 61 వేల 450గా ఉంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 500 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 600 గా ఉంది. అర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల450 గా ఉంది.హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 450 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56 వేల 350 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61 వేల 450 గా ఉంది.వెండి ధరల విషయానికి వస్తే.. కేజీ వెండి ధర రూ . 200 తగ్గి మార్కెట్ లో రూ. 78 వేల 500 గా ఉంది. చెన్నై, హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 78 వేల 500 ఉండగా, ముంబై, ఢిల్లీలలో రూ. 75 వేల 100 గా ఉంది.
* ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్
ఈనెల 29 వరకూ కొనసాగే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ (Flipkart Big Dusshera sale) సందర్భంగా ఐఫోన్ 14, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 54, మొటొరోలా ఎడ్జ్ 40, పోకో సీ51 సహా పలు ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 14 అసలు ధర రూ. 69,900 కాగా సేల్‌లో కేవలం రూ. 56,999కి లభిస్తోంది. పది శాతం బ్యాంక్ ఆఫర్లనూ కలుపుకుంటే పైన చెప్పిన ధర కంటే తక్కువకు ఈ హాట్ డివైజ్‌ను సొంతం చేసుకోవచ్చు.భారత్‌లో రూ. 29,999కి ప్రకటించిన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 రూ. 24,999 ప్రారంభ ధరకు సేల్‌లో లభించనుంది. పిక్సెల్ 7ఏపైనా భారీ డిస్కౌంట్ ప్రకటించగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో ఈ క్రేజీ డివైజ్‌ను రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు.
పిక్సెల్ ఫోన్‌పై ఏకంగా రూ. 8000 తగ్గింపు వర్తించనుంది. ఇక మొటొరోలా ఎడ్జ్ 40ను రూ. 26999కే డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్ 2 సైతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్‌లో రూ. 39,999కే కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇక పోకో ఎక్స్5 ప్రొ ఫ్లిప్‌కార్ట్‌పై కేవలం రూ 18,499కి లిస్ట్ కాగా, రెడ్‌మి నోట్ 12 ప్రొ రూ. 21,999కి లభిస్తోంది.
👉 – Please join our whatsapp channel here –