– సింహాద్రినాధుడు జమ్మివేట ఉత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతీ ఏటా విజయదశమి పర్వదినం సందర్భంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈఏడాది కూడా ఆలయ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నాయి. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడు ఉత్సవమూర్తి ప్రతినిధిగా గోవిందరాజు స్వామిని సర్వాభరణాలుతో శ్రీరాముడిగా అలంకరణ గావిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లను కొండ దిగువున ఉద్యానవనాలకు తీసుకుని వచ్చి జమ్మీవేట ఉత్సవాన్ని వైభవంగా జరిపిస్తారు. ఈ సందర్భంగా ఉద్యానవనంలో ఉన్న జమ్మిచెట్టు నుంచి ఆకులు కోసి స్వామి పాదాల చెంత ఉంచి అర్చన గావిస్తారు. అనంతరం భక్తులకు శమీ పూజ చేసిన జమ్మి ఆకులు, ప్రసాదాలు అందజేస్తారు. ఉత్సవానికి సంబంధించి ఆలయ ఇవో ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.🙏🙏🙏🙏 జై శ్రీమన్నారాయణ స్వామి 🙏
👉 – Please join our whatsapp channel here –