DailyDose

ఏకాదశీ వ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి?

ఏకాదశీ వ్రతం పాటించేటప్పుడు ప్రధానంగా పాటించవలసినదేమిటి?

ఏకాదశి ముందురోజు దశమినాటి రాత్రి భోజనం చేయరాదు. ఫలహారం స్వీకరించవచ్చు. ఏకాదశినాడు యథాశక్తి ఉపవసించాలి. లక్ష్మీనారాయణులను పూజించి పారాయణం, జపం, ధ్యానం సంకీర్తన వంటివి ఆచరించాలి. వీలైనంత మౌనాన్ని అవలంబించాలి (వృధా సంభాషణలు, నింద, పరుషవచనాలు పలుకరాదు). మరుసటి రోజున (ద్వాదశినాడు) మళ్ళీ పూజ చేసి, శుచిగా వండిన ఆహారాన్ని భగవంతునికి నివేదించి విష్ణుస్వరూపంగా భావిస్తూ శక్త్యానుసారం విప్రునకు భోజనంపెట్టి, తదనంతరం తాను భుజించాలి. ఇది ఏకాదశీ వ్రతవిధి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z