Fashion

అరటిపండుతో ఫేస్ ప్యాక్

అరటిపండుతో ఫేస్ ప్యాక్

అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అయితే ఈ పండుతో కూడా మనం అందంగా, కాంతివంతంగా తయారవ్వొచ్చు తెలుసా? ఈ పండు ఫేస్ ప్యాక్ ముఖంపై ముడతలను, మచ్చలను తొలగిస్తుంది. రోజుకో అరటిపండును తింటే ఆరోగ్యంగా ఉండొచ్చంటారు ఆరోగ్య నిపుణులు. అరటిపండ్లు కూడా పోషకాలకు మంచి వనరు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవును అరటిపండ్లు మన చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. అరటి ఫేస్ ప్యాక్ ముఖంపై ముడతలను, నల్ల మచ్చలను తగ్గిస్తాయి. అరటిపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మం సహజంగా అందంగా కనిపించడానికి, యవ్వనంగా ఉండటానికి సహాయపడతాయి. మన చర్మం అందంగా మెరవడానికి అరటిపండు ఫేస్ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ముందుగా బాగా పండిన ఒక అరటిపండును తీసుకోండి. దీన్ని రెండుగా కట్ చేసి అందులో సగం భాగాన్ని మెత్తగా రుబ్బండి. దీనిలో ఒక టేబుల్ స్పూన్ గంధాన్ని వేసి పేస్టులా చేసి తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని దీన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించండి. దీన్ని 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగండి. ఆయిల్ స్కిన్ ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది ముఖంపై ఉన్న జిడ్డును తొలగిస్తుంది.

2. బాగా అరటిపండును వెన్నును మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీనిని ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని, మెడను కడగండి. అయితే అరటి, వెన్నలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ ఇ లు ముఖంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. ఈ ఫేస్ ప్యాక్ డ్రై స్కిన్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

3. పావు వంతు పండిన అరటిపండు తీసుకుని పేస్ట్ లా చేయండి. దీనిలో ఒక టీస్పూన్ రోజ్ వాటర్ వేసి కలపండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి. అరగంట తర్వాత కడిగేయండి. ఈ ప్యాక్ చర్మంపై జిడ్డును నియంత్రించడానికి సహాయపడుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z