ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి అంబటి కాన్వాయ్ అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. అదే సమయంలో నాందేడ్ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ వెళ్తుంది. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులోని హోండా షోరూం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమల లోడుకు తగలడంతో తాళ్లు తెగి రెండు గోధుమ బస్తాలు మంత్రి కారు బానెట్‌పై పడ్డాయి. దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత మరో కారులో అంబటి ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీసులకు చెప్పడంతో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
👉 – Please join our whatsapp channel here –