అమెరికా తెలుగు అసోసియేషన్, ఆటా, ఆధ్వర్యంలో ఓర్లాండోలో అక్టోబర్ 15 2023 నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా దుర్గా మహా దేవి సాన్నిథ్యంలో జరుపబడింది .తెలుగు దనం ఉట్టి పడేలా దాదాపు 200 మంది ఆడపడుచులందరు తమ గౌరమ్మ తల్లిని పులకింప చేసారు.
ఈ పండుగను శ్రీమతి బొమ్మా రాధికా గారి ఆతిధ్య సహా కారంతో ,శ్రీ వొంగురు విజయ్ ,రీజినల్ కోఆర్డినేటర్ , ప్రశాంతి రెడ్డి ,నేషనల్ విమెన్ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఓర్లాండో లో ఇదొక తెలుగు ఉత్సవ వేడుకగా, ఉత్సాహిన్ని నింపి మాతృభూమి ని తలపింపచేసింది.
ఓర్లాండో ఆటా బృందం శ్రీమతి మాధురిమ పాతూరి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ,లీగల్ కమిట చైర్ ,డాక్టర్ బుచ్చి రెడ్డి,అమెరికన్ తెలుగు అస్సోసిసియేషన్ లోకల్ ఎగ్జిక్యూటివ్ , మహేందర్ ఆనేపల్లి ,మెంబెర్స్ కమిటి ,డాక్టర్ నీలిమ Katukuri ఈవేడుకలు విజయవంతం కావడానికి తమవంతు సహాయ సహకారాన్ని అందచేశారు .
నార్త్ కరోలినా రాష్ట్రం రాలీ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని పాలుపంచుకున్నారు. దాదాపు 150 మందికి పైగా పాల్గొన్న ఈ ప్రైవేట్ కార్యక్రమంలో మధు బొమ్మినేని మాట్లాడుతూ అమెరికాలో ఆటా ఆధ్వర్యంలో ఎన్నో నగరాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని, కార్యవర్గం తరపున మహిళలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియచేసారు. 2024 జూన్ 7 – 9 తారీకులలో అట్లాంటా లో జరుగనున్న 18th ఆటా కన్వెన్షన్ లో అందరూ పాల్గొని ఈ మహా సభలను విజయవంతం చేయాలనీ కోరారు.
👉 – Please join our whatsapp channel here –