Politics

ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

ప్రియాంక గాంధీకి ఎన్నికల సంఘం నోటీసులు

మాములుగా ఒక బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా ఉన్నవారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు మరియు వారి ప్రతిష్టను దిగజార్చే మాటలు పేలితే వారిపై చర్యలు తప్పవని తెలిసిందే. సరిగ్గా ఇప్పుడు అలంటి ఘటన ఒకటి జరిగింది.. ప్రధాని నరేంద్ర మోదీ పై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు గానూ ఎన్నికల సంఘం నోటీసులను జారీ చేసింది. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన దసరా వేడుకలలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ఇటీవల మోదీ దేవనారాయణ్ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న డొనేషన్ బాక్స్ లో ఒక కవర్ ను పెట్టారు.. తీరా అందులో ఏమి ఉందా అన్ని ఓపెన్ చేసి చూడగా రూ.21 ఉంది అంటూ ప్రియాంక తెలియచేశారు. ఈ వార్తను నేను టీవీ లో చూడడం జరిగింది అంటూ మోదీకి సంబంధించిన విషయాన్నీ పబ్లిక్ గా చెప్పింది.దీనితో ప్రధాని మోదీని కించేపరిచేలా మాట్లాడారన్న కారణంతో ఈసీ షోకాజ్ నోటీసులను ఇచ్చింది, పైగా ఈ నోటీసుపై అక్టోబర్ 30 సాయంత్రం 5 గంటల లోపల వివరణ ఇవ్వాలంటూ తెలిపింది

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z