Devotional

ఈ రాశికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది-రాశిఫలాలు

ఈ రాశికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది-రాశిఫలాలు

మేషం

సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం గౌరవప్రదంగా ‍సాగిపోతుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు సానుకూలపడతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. తల్లితండ్రుల సహాయ సహకా రాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. స్నేహితులతో అపార్థాలు తలె త్తకుండా చూసుకోండి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

వృషభం

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుం టాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ఓర్పుగా ఉంటే పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య భంగమేమీ ఉండదు. ఉద్యోగం మారే ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభ వార్తలు వింటారు.

మిథునం

బంధుమిత్రులు బాగా కలిసి వస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి సంబంధమైన వివాదం పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. వృత్తి, వ్యాపారాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. మిత్రుల వల్ల అనవసర ఖర్చులవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సతీమణికి కాలం బాగా కలిసి వస్తుంది.

కర్కాటకం

ఇంటా బయటా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయి. విపరీతంగా ఒత్తిడి కూడా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న చిన్నా చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు కొత్త అవకాశాలు అందివస్తాయి. మిత్రుల సహాయంతో కొన్ని కీలకమైన పనులు సానుకూలపడతాయి. ఉద్యోగంలో సహచరులతో సమస్యల నుంచి బయటపడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

సింహం

రోజంగా సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు తీరిక లేకుండా సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. బంధువులతో అపా ర్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి ఫలిం చకపోవచ్చు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో అదృష్టం కలిసి వస్తుంది.

కన్య

బాగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగు లకు సమయం అనుకూలంగా ఉంది. సతీమణి మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది.

తుల

ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొన్నిముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల మీద బాగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.బఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. సతీమణి సహకారంతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.

వృశ్చికం

వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే రోజంతా ప్రశాంతంగా, ఆశించిన విధంగా సాగి పోతుంది. వృత్తి, ఉద్యోగాలలో బాగా ఒత్తిడి ఉన్న ప్పటికీ బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తిస్తారు. వ్యాపారాలు కలిసి వస్తాయి. బంధువుల రాక పోకలుంటాయి. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

ధనుస్సు

ముఖ్యమైన సమస్యలు, ఇబ్బందులు తొలగిపోతాయి. ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల, ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి సమస్యేమీ ఉండదు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. విదేశాల నుంచి కూడా ఆఫర్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది. పిల్లల విద్యా విష యాల మీద దృష్టి సారిస్తారు.

మకరం

వృత్తి, ఉద్యోగాలపరంగా రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన లక్ష్యా లను సకాలం పూర్తి చేస్తారు.చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. ఎవరికీ హామీలు ఉండడం కానీ, వాగ్దానాలు చేయడం కానీ చేయవద్దు. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. సరైన ఉద్యోగంలోకి మారడానికి ఇది అనుకూలమైన సమయం. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కుంభం

వ్యయ ప్రయాసలు, ఒత్తిడి తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు నిదానంగా దారికి వస్తాయి. రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు సంతృప్తికర స్థాయిలో లాభాలు తెచ్చి పెడతాయి. వ్యక్తిగత సమస్యలకు, కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభవార్తలు వింటారు.

మీనం

ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగ్గా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. బంధుమిత్రులకు ఇతోధికంగా సహాయం చేయ డం కూడా జరుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం పరవా లేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z