Devotional

టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ మతానికి చెందిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు. తగిన విద్యార్హతలతో పాటు ఆసక్తి వున్న అభ్యర్థులు నవంబర్ 23లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

మొత్తం ఉద్యోగాలు (56): అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) 27 పోస్టులు ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 10; అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) 19 పోస్టులు చొప్పున మొత్తం 56 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి: 42 ఏళ్లు మించరాదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతన శ్రేణి: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760; ఏఈకి రూ.48,440-1,37,220; ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500 వరకు వేతనం చెల్లిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z