DailyDose

అలిపిరి నడక మార్గంలో మరో చిరుత సంచారం

అలిపిరి నడక మార్గంలో మరో చిరుత సంచారం

అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్‌ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగబంటి సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాలో రికార్డయింది. దీంతో నడక దారి భక్తులను తితిదే అప్రమత్తం చేసింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులు గంపులుగా వెళ్లాలని సూచించింది. మరో వైపు చిరుతను బంధించేందుకు తితిదే, అటవీ అధికారులు చర్యలు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z