Politics

కేటీఆర్ రైతులను ఉద్దేశిస్తూ మరో ట్వీట్

కేటీఆర్ రైతులను ఉద్దేశిస్తూ మరో ట్వీట్

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, కర్ణాటకలో కాంగ్రెస్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమాలను బేరీజు వేస్తూ.. ఏది కావాలో ఎంచుకోవాలని సూచించారు.‘‘కేసీఆర్‌ ఇస్తున్న 24గంటల విద్యుత్‌ కావాలా? కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్న 5గంటల విద్యుత్‌ కావాలా? లేక తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పిన 3 గంటల విద్యుత్‌ కావాలా? రైతుబంధు, రైతుబీమా ఇచ్చి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్‌ కావాలా?ఆరు దశాబ్దాలు ఆగం చేసిన వాళ్లు కావాలా? నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్‌ కావాలా? ఏది కావాలి మనకు? ఆలోచించు రైతన్నా?’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z