Politics

ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల

ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డి కోసం చేసిన కృషి ఫలించింది. బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థిగా మిథున్ రెడ్డిని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. కేవలం ఒక్కరితోనే పార్టీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది. మొన్నటి వరకు మిథున్ కోసం షాద్ నగర్ సెగ్మెంట్ కేటాయించాలని జితేందర్ రెడ్డి ప్రయత్నించారు. కాగా ఆయనకు, కుమారుడికి రెండుచోట్ల ఇవ్వడం కుదరదని హైకమాండ్ నుంచి సంకేతాలు రావడంతో కొడుకు కోసం తన సీటునే జితేందర్ రెడ్డి త్యాగం చేశారు. తనకంటే తన కొడుకు భవిష్యత్తే తనకు ముఖ్యమని ఆయన భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z