Food

చాక్లెట్లు వల్ల అనారోగ్యం

చాక్లెట్లు వల్ల అనారోగ్యం

పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలో ఆరోగ్యానికి హాని చేసే సీసం, క్యాడ్మియం అధికంగా ఉన్నట్లు కన్జ్యూమర్‌ రిపోర్ట్స్‌ అనే సంస్థ వెల్లడించింది. అమెరికాలోని ఏడు క్యాటగిరీల్లో 48 చాక్లెట్‌ ఉత్పత్తులను పరీక్షించినట్లు సంస్థ తెలిపింది. 16 ఉత్పత్తుల్లో ఈ లోహాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది.డార్క్‌ చాక్లెట్‌ బార్స్‌, మిల్క్‌ చాక్లెట్‌ బార్స్‌, కోకో పౌడర్‌, చాక్లెట్‌ చిప్స్‌, హాట్‌ కోకో మిక్స్‌, బ్రౌనీస్‌, చాక్లెట్‌ కేక్‌లను పరీక్షించినట్లు తెలిపింది. చాక్లెట్ల ద్వారా ఈ లోహాలు ఎక్కువ కాలం శరీరంలోకి చేరడం వల్ల నరాల వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, మూత్ర పిండాలు దెబ్బతింటాయని తెలిపింది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా నష్టపోతారని వివరించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z