కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. వైకాపా అధినేత తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని వేసేస్తే.. ఆయన సైకో ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.కావలిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైందన్నారు. దీంతో నడిరోడ్డుపై పట్టపగలు వైకాపా నేతలు గూండాల కంటే ఘోరంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకో జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్.. ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. సైకో జగన్ పోతేనే, ఇలాంటి పిల్ల సైకో గ్యాంగులన్నీ పోతాయన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడవుతుందని లోకేశ్ మండిపడ్డారు.
👉 – Please join our whatsapp channel here –