Sports

పారా క్రీడల్లో భారత్‌ నయా రికార్డు

పారా క్రీడల్లో భారత్‌ నయా రికార్డు

క్రీడల్లో భారత్ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రీడల్లో మునుపెన్నడూ లేని విధంగా మరింత ముందడుగు వేస్తోంది. ఇప్పటికే ఏసియన్ గేమ్స్​లో వందకుపైగా పతకాలు సాధించిన ఇండియా ఇప్పుడు.. ఆసియా పారా క్రీడల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ప్రతిష్టాత్మక క్రీడా సంగ్రామంలో…. తొలిసారి వంద పతకాల మైలురాయిని దాటింది. శనివారం జరిగిన పురుషుల 400 మీటర్ల పరుగులో… భారత్‌ పారా అథ్లెట్‌ దిలీప్‌ మహదు గవిత్‌ పసిడి పతకాన్ని గెలవడంతో.. భారత్‌ పతకాల సంఖ్య వందకు చేరుకుంది. ఆసియా పారా క్రీడల్లో ఇప్పటివరకు..29 స్వర్ణాలు,31 రజతాలు, 51 కాంస్యాలతో మెుత్తం 111 పతకాలను దక్కించుకుని..పాయింట్ల పట్టికలో భారత్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది.ఆసియా పారా క్రీడల్లో తొలిసారిగా భారత క్రీడాకారులు వంద పతకాలు గెలవడంతో ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పారా అథ్లెట్ల కఠిన శ్రమ, అంకిత భావం కారణంగానే సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు. పారా క్రీడాకారులు దేశానికి గర్వకారణంగా నిలిచారని ఇంతకంటే ఆనందం మరొకటి ఉండదంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z