Politics

చంద్రబాబు ఈ వయసులో జైలులో ఉండడం బాధాకరం

చంద్రబాబు ఈ వయసులో జైలులో ఉండడం బాధాకరం

ఆంధ్రప్రదేశ్ టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ స్కాం లో అవినీతి చేశాడన్న ఆరోపణల మీద రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇప్పటికి రోజులు పూర్తి అయిన నేపథ్యంలో టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ గురించి తెలంగాణ ఎమ్మెల్సీ గా ఉన్న కవిత కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా వేదికగా కవిత నిర్వహించిన ఒక క్వశ్చన్ పోల్ లో భాగంగా ఒక నెటిజన్ చంద్రబాబు అరెస్ట్ పై మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించగా ? ఈ ప్రశ్నకు కవిత స్పందిస్తూ… చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటిషన్ కు ఈ వయసులో ఇలా జైలులో ఉండడం చాలా బాధాకరం అన్నారు. ఈ సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు ఎంత బాధలో ఉంటారో నేను అర్ధం చేసుకోగలను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు కవిత.ఈ సందర్భంగా చంద్రబాబు ఫామిలీ కి నేను నా సానుభూతిని తెలియచేస్తున్న అంటూ ఈ సమాధానాన్ని ముగించింది కవిత.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z