NRI-NRT

52 దేశాల బీఆర్ఎస్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

52 దేశాల బీఆర్ఎస్ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం

52 దేశాల బీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖల ప్రతినిధులతో జూమ్ కాల్ లో కేటీఆర్ ముఖ ముఖి.2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పై దిశా నిర్దేశం.

గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యములో ఈరోజు 52 దేశాల బీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖల ప్రతినిధులతో జూమ్ కాల్ లో కేటీఆర్ ముఖ ముఖి జరిగింది ఈ కార్యక్రములో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం పాల్గొన్నారు.

ముఖ్య అతిధిగా హాజరు అయినా కేటీఆర్ గారు మాట్లాడుతూ చాల సందర్భాలలో వేయిల మైళ్ళ దూరములో వున్నా తెలంగాణ లో ఏమి జరుగుతది , ఎలా వున్నారు అనేది మీలో ఆలోచన, ఆసక్తి, కుతూహలం , ఆరాటం ఎప్పటికి వుంటది . 2004 లో ఎన్నో సంధర్భాల్లో మీరు సలహాలు ఇచ్చారు, మన సంస్కృతి కి , మన సంప్రదాయాల కి రూపాలైన బతుకమ్మ మిగితా రూపాలలో ఉద్యమ సమయములో నిరసన కార్యక్రమాలు చేసారు. నేను కూడా ఒక ఎన్నరీతిగానే వున్నాను నాకు తెలుసు సాధక బాధకాలు ,తెలంగాణ వచ్చాక ఎలా రాష్ట్రము ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు గమనించవచ్చు , ఆమె రాజకీయ ప్రత్యర్థులు వుంటారు ,మన పురోగతిని అడ్డుకొని రాజకీయ లాభాపేక్ష గురించి ఎన్నో రకాల కుయుక్తులు పన్నుతున్నారు. అయితే మనకి ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టారో అందరు మనతో వుంటారు .

ఇప్పుడు వైద్య రంగములో ఎంతో పురోగతి గణనీయంగా చేసుకున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయని ఇప్పుడు కార్పొరేట్ స్థాయిని మించి ప్రభుత్వ దుకాణాలు, వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు .

తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 93,151గా ఉంటే, ప్రస్తుతం అది రూ. 3,12,398కి చేరింది. దేశ సగటు తలసరి ఆదాయం రూ. 1,72,000 కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ. 1,40,398 ఎక్కువ.

తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. 2014లో రూ. 66,276 కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు.. 2023 నాటికి రూ. 2,41,275 కోట్లకు ఎగబాకింది. 264 శాతం పెరుగుదలతో ఐటీ ఎగుమతుల్లోనూ ఏ రాష్ట్రమూ తెలంగాణకు సాటిరాదని నిరూపించింది.

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఐటీరంగం ముఖచిత్రమే మారిపోయింది. ప్రభుత్వ సమర్థ కార్యాచరణతో ఐటీ ఉద్యోగావకాశాలు 24౩ శాతం వృద్ధిచెందాయి. 2014లో ఐటీ ఉద్యోగుల సంఖ్య 3,71,774గా ఉంటే 2023 వరకు 9,05,715కు అంటే మూడు రెట్లు పెరిగింది.

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న గురుకుల విద్య ఇప్పుడు దేశానికే రోల్‌మాడల్‌గా మారింది. ఉన్నతవిద్యలో తెలంగాణలో పనితీరు మెరుగ్గా ఉన్నది. 2014లో కేవలం 298 గురుకులాలు మాత్రమే ఉండగా.. 2023 నాటికి ఆ సంఖ్య 1,002కు చేరుకొన్నది.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతంగా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసిఆర్ గారి నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్ అన్నారు. రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అద్భుతంగా అన్ని రంగాల్లో ప్రగతి పథంలో తీసుకెళుతున్న కేసిఆర్ గారి నాయకత్వం మరోసారి తెలంగాణకి అవసరమనే విషయాన్ని తమ తమ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. జీవితంలో ఉన్నత చదువులు చదివి, వ్యాపార వాణిజ్య రంగాల్లో రాణించి విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు అంటే గ్రామాల్లో గొప్ప గౌరవం ఉందని, ఇలాంటి ప్రవాస భారతీయులు తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగే నాయకత్వానికి ఎన్నికలలో ఓటు వేయాలని కోరితే ఇక్కడి ఓటర్లు వింటారని కేటీఆర్ అన్నారు. రానున్న 30 రోజులు తెలంగాణ రాష్ట్రానికి సైతం అత్యంత కీలకమని, ఒకప్పుడు కాంగ్రెస్ వలన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి 60 సంవత్సరాలు అనేక బాధలకు గురైందన్నారు. మరోసారి దారితప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 50 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధి వెనక్కి పోతుందని కేటీఆర్ అన్నారు.

నేను మీ అందరిని కోరేది ఒక్కటే మన రాష్ట్రములో ఇపుడు ఎలక్షన్ ప్రచారం నడుస్తుంది , రేపు జరగబోయే ఎన్నికలలో తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉండెనో ఇపుడు మన కళ్ళముందు ఎంతో పురోగతి తో ముందుకు వెళ్తుంది మీరు ఎన్నారైలు చాల శక్తీ మంతులు మీరు చెప్తే మీ ఊరిలో,మీ వుండే ప్రాంతములో ఎంతో గొప్పగా మీ ప్రభావం ఉంటుంది మీరు ఈ ముప్పై రోజులు మీ సాయ శక్తుల ప్రయత్నం చేసి వివిధ మాధ్యమాల ద్వారా మీరు తెలంగాణ అభివృద్ధిని వివరించాలని అన్నారు , సోషల్ మీడియా వెదికాగా ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్,X , స్పేసేస్ లో మీరు తెలంగాణ అభివృద్ధిని వివరించి మీ జిల్లాలో, మీ మండలములో, మీ ఊరిలో వివాయించి మల్లి కెసిఆర్ గారిని గెలిపించుకుందాం.

తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాలలో కెసిఆర్ గారి ఆధ్వర్యంలో సాధించిన ప్రగతి దృష్టిలో ఉంచుకొని ప్రజల మద్దతు కోరాలని ఎన్నారైలకు సూచించారు. ఇందుకోసం తమ తమ సామాజిక మాధ్యమాల ఆధారంగా గత తెలంగాణ కష్టాలను, ప్రస్తుతం తెలంగాణ సాధించిన అభివృద్ధిని వివరిస్తూ వీడియోలు, పోస్టుల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయులు సామాజిక మాధ్యమాలలో మరింత చురుగ్గా ఉంటూ, తెలంగాణ రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించే ప్రయత్నం చేయాలని సూచించారు.

బిఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ,ఈ కార్యక్రమానికి 52 దేశాల ప్రతినిధులను అందరికి ధన్యవాదాలు తెలిపారు ,రాబోయే రోజుల్లో ప్రత్యక్ష ప్రచారాన్ని వచ్చేవాళ్ళు అందరూ కో-ఆర్డినేట్ చేసుకొని అందరి తేదీలు ఇవ్వాలని , ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసుకొని ప్రత్యక్ష ప్రచములో వెళ్తామని అలాగే సోషల్ మీడియా లో చురుక్కా పాల్గొని తెలంగాణ అభివృద్ధిని అందరికి చేరేలా చెయ్యాలని, కంటెంట్ మొత్తం అందజేస్తామని అన్నారు ,ఎవరికైనా ఏ విషములో నైనా సూచనలు సలహాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించాలని కోరారు.

అనిల్ కూర్మాచలం మరియు మహేష్ తన్నీరు మాట్లాడుతూ ఆందరూ ఆక్టివ్ గా పాల్గొన్ని చేసి మల్లి కెసిఆర్ గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావాలని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z