చంద్రబాబు అరెస్టుపై వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్న తెలుగుదేశం మరో కార్యక్రమానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ కార్యక్రమాలు చేపట్టిన తెదేపా మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’ పేరిట మరో వినూత్న నిరసనకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి తెదేపా అధినేత చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినదించాలని కోరారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.
👉 – Please join our whatsapp channel here –