సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్ల నుంచి ఎంతో బాధను అనుభవిస్తూ వస్తున్నాడు. మొదట అన్న రమేష్ ను పోగొట్టుకున్నాడు. ఆ తరువాత తల్లి ఇందిరాదేవిని.. ఏడాది దాటకముందే తండ్రి కృష్ణను పోగొట్టుకున్నాడు. ఇక ఆ భాదను దిగమింగుకొని కుటుంబం కోసం కష్టపడుతున్నాడు. ఇక చూస్తూ చూస్తూనే ఇందిరా దేవి మొదటి సంవత్సరీకం కూడా వచ్చేసింది. నేడు ఈ కార్యక్రమాన్నీ ఘట్టమనేని ఇంట ఘనంగా జరిపించారు. ఇక ఇన్ని విషాదాల తరువాత ఘట్టమనేని ఇంట ఒక శుభకార్యం జరగనుందని సమాచారం అందుతుంది. అదే సితార ఓణీల ఫంక్షన్. ప్రతి ఆడపిల్లకు జరిగే మొట్ట మొదటి పండుగ. ఇందిరా దేవి బ్రతికి ఉన్నప్పుడే సితారకు ఓణీల ఫంక్షన్ చేయాలనీ కోరుకున్నారట. కానీ, మహేష్.. ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయాడు.ఇక దీంతో తల్లి చివరి కోరిక అదే అని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మహేష్ చేయనున్నారట. సితూ పాపకు ఇప్పుడు 11 ఏళ్లు. ఇక ఇదే కరెక్ట్ వయస్సు అని మహేష్ ఈ ఫంక్షన్ చేయనున్నాడని సమాచారం. ఘట్టమనేని కుటుంబం మొత్తం ఈ ఫంక్షన్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇక సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుట్టినప్పటినుంచి ఆమె చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం సితూ పాప సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ముందు ముందు సితార హీరోయిన్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. అందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.
👉 – Please join our whatsapp channel here –