టాలీవుడ్ హీరో మరియు హీరోయిన్ లుగా ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ కాబోయే దంపతులు నవంబర్ ఒకటవ తేదీన పెద్దల సమక్షములో మూడు మూళ్ళ బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా ఇటలీలో జరుగనున్న ఈ పెళ్లి కోసం ఇప్పటికే వరుణ్ లావణ్యలు మరియు కుటుంబ సభ్యులు చేరుకోగా.. తాజాగా పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ లు కుటుంబాలతో సహా ఇటలీ బయలుదేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ తన భార్య అన్న లెజినోవా తో కలిసి వెళుతుండగా బన్నీ మాత్రం కుటుంబంతో సహా ఇటలీకి వెళుతున్నారు.కాగా వివాహం అనంతరం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ చేయడానికి మెగా ఫామిలీ ప్లాన్ చేస్తోంది.
👉 – Please join our whatsapp channel here –