Politics

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వైకాపా నుంచి స్వాతంత్య్రం కావాలంటున్న నారా భువనేశ్వరికి ఎక్కడ ఇబ్బంది కలిగిందో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభలు పెట్టుకుంటున్నారు కదా.. ఆ స్వాతంత్య్రం సరిపోదా అని ప్రశ్నించారు. విజయనగరంలో ఉప సభాపతి వీరభద్రస్వామి నివాసంలో బొత్స విలేకర్లతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజలకు చెప్పిందే చేశాం. నాలుగున్నరేళ్లలో చేసిందే చెప్తాం. అందుకే సామాజిక సాధికార యాత్ర చేపట్టాం’ అని అన్నారు. తెదేపాలా మోసగించే మాటలు చెప్పబోమన్నారు. 2014లో తెదేపా, జనసేన, భాజపాలు విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలో 650 హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. మళ్లీ ఆరు వాగ్దానాలతో తెదేపా, జనసేన ముఠా వస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజమహేంద్రవరం జైల్లో తనకు ప్రాణహాని ఉందని చంద్రబాబు రాసిన లేఖపై బొత్స మాట్లాడుతూ ఆయన ఏదైనా రాస్తారన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z